మూసీకి భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణంలోనైనా..

by Anukaran |
మూసీకి భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణంలోనైనా..
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో మూసీ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు కొనసాగుతున్నది. దీంతో మూసీ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ఓ ప్రకటన చేశారు. ఏ క్షణంలోనైనా మూసీ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నదని, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా మూసీ పరివాహక గ్రామాల ప్రజలు నది, వాగుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు.

ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 642.4 అడుగులు(3.79 టీఎంసీలు) గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 6,832 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed