కుంటాలకు జలకళ..!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ నయాగరా జలపాతంగా పేరుగాంచిన కుంటాల వాటర్ ఫాల్స్ జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతానికి వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ దూకుడుండంతో జలపాతం సుందరంగా కనిపిస్తోంది. జలపాతం పై ప్రాంతంలో మాత్రమే పర్యాటకులకు అనుమతిని ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా జలపాతం కీలక ప్రదేశాలకు అటవీ, పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సందర్శకులు నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు.

Advertisement