పులిచింతలకు పెరిగిన వరద ఉధృతి..

by  |
పులిచింతలకు పెరిగిన వరద ఉధృతి..
X

దిశ, హుజుర్ నగర్ : పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శనివారం సాగర్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.దీంతో పులిచింతలకు ఇన్ ఫ్లో భారీగా పెరిగింది.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను 161.940 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 27.83 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో 1,60,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో ప్రస్తుతానికి నిల్. సాగర్ గేట్లు ఎత్తడంతో 100 క్యూసెక్కుల వరద కృష్ణా నదిలోకి చేరుతోంది.



Next Story

Most Viewed