- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రాజెక్టులకు వరద
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద పెరుగుతోంది. కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టు ఆల్మట్టికి 29,231 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, సోమవారం నాటికి 76టీఎంసీలకు చేరింది. ఇక జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,289 క్యూసెక్కులు వస్తుండగా, 37టీఎంసీల నిల్వ ఉంది. ఇక గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీలోకి 5,621 క్యూసెక్కులు వస్తున్నాయి. 90టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 32టీఎంసీల నీరు నిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎస్సారెస్పీలోకి వరద కొనసాగుతోంది. మరోవైపు గోదావరి బేసిన్‌లో పెరూర్ దగ్గర వరద పెరిగింది. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వరద రావడంతో ప్రవాహం 30వేల క్యూసెక్కులకు చేరింది. సోమవారం ఉదయం వరకు ధవళేశ్వరం దగ్గర 26వేల క్యూసెక్కులు నమోదవుతున్నాయి.
Next Story