ఫ్లిప్‌కార్ట్ క్విక్.. 90 నిమిషాల్లో కిరణా సామగ్రి

by  |
ఫ్లిప్‌కార్ట్ క్విక్.. 90 నిమిషాల్లో కిరణా సామగ్రి
X

న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దూకుడు పెంచింది. అంతర్జాతీయ దిగ్గజం అమెజాన్‌ను దీటుగా ఎదుర్కోవడం కోసం కిరణా సామగ్రి, గృహోపకరణాలను ఇంటికే సరఫరా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నది. అది కూడా ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ‘ఫ్లిప్‌కార్టు క్విక్ ద్వారా హైపర్ లోకల్ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా మొబైల్ ఫోన్లు, స్టేషనరీ సామగ్రిని కూడా విక్రయిస్తాం. ప్రధానంగా కిరణా సామగ్రిని విక్రయించడమే లక్ష్యం. ప్రస్తుతం ఉన్న మిగతా ఈ-కామర్స్ సంస్థల కంటే వేగవంతమైన సర్వీసును అందిస్తాం’అని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫ్లిప్‌కార్ట్ క్విక్ సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. కానీ, ఎప్పటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయో స్పష్టం చేయలేదు.

దేశంలో ప్రస్తుతం అమెజాన్, అలీబాబాకు చెందిన బిగ్‌బాస్కెట్‌ కిరాణా సామగ్రిని సరఫరా చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ తాజా సేవలతో ఆ రెండు సంస్థలతో ప్రత్యక్ష పోటీకి దిగుతున్నట్టు స్పష్టమవుతున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ త్వరలో జియోమార్ట్ సేవల ద్వారా కిరాణా సామగ్రి సరఫరాను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత కరోనా భయోందోళన నేపథ్యంలో ఎక్కువ మంది కిరాణా సామగ్రి, గృహోపకరణాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకొని గూగుల్‌కు చెందిన్ డున్జో, నాస్పర్‌కు చెందిన స్విగ్గి ఇంటికే కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తున్నది.



Next Story

Most Viewed