ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ ప్రారంభం

by  |
ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ ప్రారంభం
X

దిశ, వెబ్‌‌డెస్క్ : లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌ అన్నీ కూడా తమ సేవలను టెంపరరీ‌గా నిలిపేశాయి. కేవలం నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీకే పరిమితమయ్యాయి. కాగా ఇటీవలే లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఈ కామర్స్‌లో మళ్లీ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌ను నేటి (జూన్ 23, మంగళవారం) నుంచి ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు జూన్ 22న రాత్రి 8 గంటలకే సేల్ ప్రారంభం కాగా, ఈ సేల్ జూన్ 27న ముగియనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వేర్, ఇయ‌ర్‌బ‌డ్స్‌, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ ఎసెన్షియల్స్‌, వైఫై రూటర్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు మరో 10 శాతం అదనపు తగ్గింపు ఇవ్వనుంది.

స్మార్ట్‌ఫోన్ల‌పై డీల్స్
శాంసంగ్ :

గతేడాది మార్కెట్‌లోకి విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ‘ఏ80’ స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకు అందించనుంది. ప్రపంచంలోనే తొలి రొటేటింగ్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుత ధర – రూ. 41,999/- కాగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో – రూ. 21,999/-లకు లభించనుంది.

షియోమీ

– రెడ్‌మీ కె20 – రూ.20,499/-
– రెడ్‌మీ కె20 ప్రొ – రూ.23,499/-

రియ‌ల్‌మీ

– రియ‌ల్‌మీ ఎక్స్‌2 ప్రొ – ధ‌ర రూ.25,999/-
-రియ‌ల్‌మీ ఎక్స్ – రూ.15,999/-

వివో :

వివో జె1ఎక్స్ ప్రస్తుత ధర రూ. 16,990/- కాగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 14,990/-

ఒప్పో

4జీబీ ర్యామ్ సామర్థ్యంతో ఈ ఏడాదే విడుదలైన ఒప్పో ఏ9 ఫోన్‌పై మూడు వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ ధర – రూ. 12,990/-

హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తుండగా.. ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు, బేబీ నీడ్స్‌పై 70 శాతం, ఫుట్‌వేర్‌పై 40 శాతం, ఫ్యాషన్ వేర్‌పై 50-70 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.


Next Story

Most Viewed