స్కాపిక్‌లో వంద శాతం వాటాను కొన్న ఫ్లిప్‌కార్ట్.!

by Harish |
స్కాపిక్‌లో వంద శాతం వాటాను కొన్న ఫ్లిప్‌కార్ట్.!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రిటైల్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఆధారిత కంపెనీని కొనుగోలు చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్ పాల్‌ఫామ్‌లో మూడేళ్ల క్రితం ప్రారంభమై ఏఆర్, 3డీ కంటెంట్‌ను అందిస్తున్న స్కాపిక్ (Scapic) కంపెనీలో వంద శాతం వాటాను ఫ్లిప్‌కార్ట్ దక్కించుకుంది. ఒప్పందం విలువను వెల్లడించకపోయినప్పటికీ ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ స్వయంగా ప్రకటించింది. క్లౌడ్ ఆధారిత సేవల ద్వారా ఏఆర్, 3డీ కంటెంట్‌ను స్కాపిక్ సంస్థ అందిస్తోంది.

ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెటింగ్, ఈ-కామర్స్ సంస్థలకు సేవలను అందిస్తోంది. రిటైల్ విభాగంలో ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అంశాలపై పెట్టుబడులు పెట్టాం. కస్టమర్లు సులభంగా పొందగలిగే కంటెంట్‌ను అందించే ప్రయత్నాలు చేస్తున్నామని’ ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. రానున్న రోజుల్లో స్కాపిక్ కంపెనీ బోర్డులో నైపుణ్యం కలిగిన డెవలపర్లు, డిజైనర్లను తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. కెమెరా ఎక్స్‌పీరియన్స్, బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్, వర్చువల్ స్టోర్లను మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలుపెట్టామని కంపెనీ వెల్లడించింది. కాగా, స్కాపిక్ కంపెనీ 2017లో ప్రారంభమైంది.

Advertisement

Next Story