- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనాతో ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా భూతం ఏపీలో భయానకం సృష్టిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మింగేసింది. రెండు వారాల వ్యవధిలో మూడు తరాల వారిని బలితీసుకున్నది. ఓ ఇంట్లో 16 మందికి కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిలో ఐదుగురు మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో ఓ ఇంటిలో 16 మందికి ఇటీవల కరోనా సోకింది. దీంతో వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారిలో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. 15 రోజుల వ్యవధిలో ఐదుగురు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story