ఆర్థిక వృద్ధి 1.8 శాతమే : ఫిచ్ సొల్యూషన్స్!

by Harish |
ఆర్థిక వృద్ధి 1.8 శాతమే : ఫిచ్ సొల్యూషన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అత్యధికంగా ఆదాయాన్ని కోల్పోవడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాను ప్రముఖ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ 1.8 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. గత వారం రోజులుగా నిరంతరం చమురు ధరలు తగ్గడం, కరోనా కేసులు పెరగడం వంటి పరిణామాలతో దేశ నిర్దిష్ట వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను సర్దుబాటు చేస్తూనే ఉన్నాము. ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు గతంలో ఉన్న 4.6 శాతం నుంచి 1.8 శాతానికి సవరించబడింది. కరోనా వైరస్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రైవేటు వినియోగం తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయిందని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. స్థిరమైన పెట్టుబడులలో పెరిగిన ఆర్థిక అనిశ్చితి కారణంగా సంస్థలు నగదును పొదుపు చేసి మూలధన వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. కేంద్రం ఆర్థిక ఉద్దీపన అమలు నెమ్మదిగా ఉండటం వల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రతికూల స్థితిలో కొనసాగుతోందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది.

Tags : coronavirus, covid-19, fitch solution, GDP, pandamic

Advertisement

Next Story