- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేపల వేటతో..‘గిన్నిస్’రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: చేపలు పట్టడం చాలా మందికి సరాదా. మనదేశంలో ఎక్కువగా పల్లెల్లో చెరువులకాడ, కొలనుల వద్ద చేపలు పట్టడం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, విదేశాల్లో చేపల కోసం ఫిషింగ్ స్పాట్లు సపరేట్‌గా ఉంటాయి. జనరల్లీ ఫిషింగ్ మనందరికీ సరదా అయితే, అమెరికాలోని ఇల్‌నాయిస్‌కు చెందిన జెఫ్ కొలొడ్‌జిన్‌స్కి అనే ఫిషర్‌మ్యాన్‌కు చేపలు పట్టడంలో రికార్డులు కొల్లగొట్టడం సరదా. అందుకే తాజాగా తన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టాడు.
జెఫ్ కొలొడ్‌జిన్‌స్కిను ‘మారథాన్ మ్యాన్’ అని కూడా పిలుస్తారు. బుధవారం జెఫ్ సంకోటి రిసార్ట్‌లోని పియోరియాలో చెరువులో చేపలు పట్టి రికార్డు సాధించడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఉదయం 9 గంటలకు చేపలు పట్టడం మొదలుపెట్టి.. ఆ తర్వాతి రోజు (గురువారం) ఉదయం 9 గంటల వరకు తన చేపల వేట కొనసాగించాడు. 24 గంటల్లో జెఫ్ మొత్తంగా 2,645 చేపల్ని పట్టాడు. ఇది ఓ రికార్డు. తాను చేపలు పట్టిన ప్రూఫ్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆఫీసర్లకు అందజేశాడు. మరికొన్ని రోజుల్లో ఒక్కరోజులో అత్యధిక చేపలు పట్టిన వ్యక్తిగా జెఫ్ పేరు అఫిసియల్‌గా ప్రకటిస్తారు. అయితే, ప్రస్తుతం ఈ రికార్డు కూడా జెఫ్ పేరు మీదనే ఉంది. అతను 2019లో 24గంటల్లో2,172 చేపలు పట్టి గిన్నిస్ రికార్డు సాధించాడు. తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ‘ఫిషింగ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్’కు విరాళాలు అందించడానికి ప్రస్తుతం ఈ ఫీట్ చేశాడు జెఫ్. ఈ రికార్డు ద్వారా దాదాపు 20వేల డాలర్లు (రూ. 14, 70,250) సమకూరుతాయని జెఫ్ భావిస్తున్నాడు.