- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఎల్ తొలి సెమీస్ డ్రా
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ 2020/21 సీజన్ ప్లేఆఫ్స్‌లో భాగంగా శుక్రవారం ఫటోర్డా స్టేడియంలో ఫస్ట్ లెగ్ తొలి సెమీస్ జరిగింది. లీగ్ విన్నర్ ముంబయి సిటీ ఎఫ్‌సీ, టేబుల్‌లో నాలుగవ స్థానం దక్కించుకున్న ఫుట్‌బాల్ క్లబ్ గోవాకు మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఆట ప్రారంభమైన తొలి నిమిషాల్లోనే గోవా జట్టు ఫౌల్ చేసింది.
కానీ దాన్నిముంబయి జట్టు ఉపయోగించుకోలేక పోయింది. 19వ నిమిషంలో గోవా జట్టుకు పెనాల్టీ లభించింది. గోవా ఆటగాడు ఇగొర్ అంగులో పెనాల్టీని గోల్‌గా మలచడంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 38వ నిమిషంలో ముంబయి సిటీ ఆటగాడు హుగో బోమస్ అద్భుతమైన గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. 59వ నిమిషంలో గోవా ఆటగాడు ఆదిల్ ఖాన్ ఇచ్చిన పాస్‌ను సావియర్ గామా గోల్ చేయడంతో గోవా మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. 61వ నిమిషంలో ముంబయి ఆటగాడు మోర్టాడా ఫాల్ గోల్ చేసి స్కోర్లను మరోసారి సమం చేశాడు.
ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో తొలి సెమీస్ 2-2తో డ్రాగా ముగిసింది. రెండో లెగ్‌లో జరిగే మరో సెమీస్‌లో ఎవరు గెలిస్తే ఆ జట్టు ఫైనల్ చేరుకుంటుంది. తొలి లెగ్ రెండో సెమీస్ శనివారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్, ఏటీకే మోహన్ బగాన్ మధ్య జరుగనున్నది.