ఎస్ఓపీలో రాచకొండకు ప్రథమ స్థానం

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: పోలీస్‌శాఖలో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరిస్తున్న పద్ధతిలో రాచకొండ కమిషనరేట్‌కు ప్రథమ స్థానం లభించడం పట్ల సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశారు. డీజీపీ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు, అధికారులకు కాల్స్ చేసినపుడు ఆ సమయంలో ఇచ్చిన సమాధానం, రెస్పాన్స్‌లో మెరుగైన ఫలితం సాధించినట్టు తెలిపారు. అధికారిక నంబర్లకు (ల్యాండ్ లైన్ అండ్ సెల్ ఫోన్లు) కాల్స్ చేసిన సమయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్ పద్దతిలో రాచకొండ కమిషనరేట్ 68.57 శాతంతో పాటు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఫలితాన్ని 100శాతం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Advertisement