- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో మళ్లీ ఫస్ట్ డోసు షురూ..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ఫస్ట్ డోసు షురూ అయింది. అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో 52,718 మంది తొలి డోసు, 53,106 మంది రెండో డోసును తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 40 మొబైల్ వాహనాల్లో 11 వేల మంది ఫస్ట్ డోసు తీసుకోవడం గమనార్హం. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,04,921 మంది హెల్త్ కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 2,27,217 మంది రెండో డోసును తీసుకున్నారు. అదే విధంగా 3,17,318 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మొదటి, 2,05,754 మంది రెండో టీకాను పొందారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 55,65,804 మంది తొలి 7,73,502 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 45 ఏళ్ల పై బడిన వారిలో 55,13,942 మంది ఫస్ట్, 28,12,258 మంది రెండో డోసును తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులెటెన్ లో స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు 1,27,40,521 మంది ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోగా, 29,80,195 మంది ప్రైవేట్ సెంటర్లలో టీకా వేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ క్యూ…
జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయడంతో ఆయా కేంద్రాల వద్ద జనాలు క్యూ కట్టారు. ఒక్కో వ్యక్తి టీకా పొందేందుకు సుమారు నాలుగైదు గంటల సమయం పట్టిందని స్వయంగా ఆఫీసర్లు పేర్కొన్నారు. వాస్తవంగా గత మూడు నెలల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ లో ముందస్తు నమోదు ఉంటేనే వ్యాక్సిన్ వేశారు. కానీ బుధవారం నుంచి ఆ నిబంధనను తొలగించడం తో టీకా కొరకు ప్రజలు పరుగులు పెట్టారు. అయితే కొన్ని పీహెచ్ సీల్లో సాధారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం వలన కరోనా టీకా పంపిణీ జరగలేదని వైద్యశాఖ వివరించింది. గురువారం నుంచి జీహెచ్ఎంసీ తో పాటు జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఫస్ట్, సెకండ్ డోసును స్పాట్ రిజిస్ట్రేషన్ద్ ద్వారా కూడా వేయబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.