నాగర్ కర్నూల్లో తొలి ‘కరోనా’ కేసు

by Shyam |
నాగర్ కర్నూల్లో తొలి ‘కరోనా’ కేసు
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా, నాగర్ కర్నూలు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకెళ్తే.. ఇటీవల డిల్లీ వెళ్లొచ్చిన 30ఏండ్ల యువకుడికి కరోనా సోకిందని అధికారులు నిర్ధారించారు. బాధితుడిని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు తరలించినట్టు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడించారు. అయితే, నాగర్ కర్నూలు జిల్లాలో ఇదే తొలి కేసు కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది.

Tags: corona, virus, nagar kurnool, DMHO sudhakar lal, first corona case, delhi, fever hospital


Advertisement
Next Story

Most Viewed