కోదాడలో మొదటి కరోనా కేసు

by vinod kumar |   ( Updated:2020-06-25 07:01:09.0  )
కోదాడలో మొదటి కరోనా కేసు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో మొదటి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 11న సదరు వ్యక్తి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బంధువుల పెళ్లికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విజయవాడలో చికిత్స తీసుకున్నాడు. కోలుకున్నట్లే కనిపించినా మళ్లీ అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించారు. గురువారం ఉదయం కరోనా పాజిటి‌‌గా తేలింది. దీంతో అతన్ని సూర్యాపేటకు తరలించారు.

Advertisement

Next Story