తెలంగాణలో తొలి బయో గ్యాస్ ప్లాంట్ సిద్దిపేటలో ఏర్పాటు.. మంత్రి హరీష్ రావు

by Shyam |   ( Updated:2021-12-19 11:57:30.0  )
bio gas
X

దిశ, సిద్దిపేట: మంత్రి హరిశ్ రావు ఆలోచనతో సిద్దిపేట మున్సిపాలిటీ మరో వినూత్న కార్యక్రమానికి వేదిక కానుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తడి చెత్తతో బయో గ్యాస్( సి ఎన్ జి) తయారు చేసే ప్లాంట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వారంలో రెండు రోజులు తడి చెత్త సేకరించి డంప్ యార్డ్‌లు ఏర్పాటు చేసి ఎరువు తయారు చేస్తున్నారు. బెంగుళూర్ తరహాలో బయో గ్యాస్ సిఎన్‌జి తయారీ ప్లాంట్ ఏర్పాటును సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే 2వ బయో గ్యాస్ ప్లాంట్. తడి, పొడి చెత్త వేరు చేయడంలో సిద్దిపేట జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. రూ.6కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కార్బన్ లేట్స్ ఇండియా అనే ప్రైవేటు కంపెనీ‌కి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు 5 నుండి 10 సంవత్సరాలు ఒప్పందం తో నిర్వహణ ఉంటుంది. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో నిర్మించిన బయో గ్యాస్ ప్లాంట్‌ను సోమవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు.

గ్యాస్ తయారీ విధానం..

ఇంటింటా సేకరించిన తడి చెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం దీనిని పైపు ద్వారా ఫ్రీ డిజేస్టర్ అనే ట్యాంక్ లోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుండి 14 మీటర్ల వెడల్పు 6 మీటర్ల ఎత్తులో ఉన్న మరో ట్యాంక్ లోకి ఇక్కడ తయారు అయిన ద్రావణాన్ని పంపిస్తారు. తర్వాత ఆ ట్యాంక్ లో మైక్రో ఆర్గాన్ లను వేస్తారు. ఆ సమయంలో విడుదలయ్యే మిథేన్ గ్యాస్ నుండి సిఎన్‌జిను వేరు చేసి సిలిండర్‌‌లలో నింపుతారు.

Advertisement

Next Story

Most Viewed