- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏవోబీలో టెన్షన్.. టెన్షన్.. ఎదురుకాల్పులతో దద్దరిల్లిన మన్యం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏవోబీ(ఏపీ, ఒడిశా) సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
అయితే, వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున తులసిపాడు అటవీ ప్రాంతంలో గాలింపు బృందాలకు మావోయిస్టులు కనిపించడంతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Next Story