- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్‌లో మిస్టరీ.. 15 రోజులుగా ఆ ఇంటిని వెంటాడుతున్న మంటలు (వీడియో)
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇంట్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. అంతలోనే ఇంట్లోంచి ఏదో కాలిపోతున్న వాసన. అటు వైపు చూడగానే మంటల్లో కాలి బూడిదవుతున్న బట్టలు. ఇలా ఒకచోట కాదు, ఇంటి ఆవరణలోని ఏదో ఒక చోట 15 రోజులుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు కాలిపోతూనే ఉన్నాయి. ఏకంగా 15 రోజులుగా జరుగుతున్న అగ్ని దేవుని విలయతాండవంతో ఆ కుటుంబం అంతా భయం గుప్పిట్లోకి చేరిపోయింది. ఇల్లంతా వెదికినా ఎక్కడ కూడా నిప్పు కణికలు లేవు, మంటలు పుట్టడానికి కారణమయ్యే వస్తువులూ లేవు. అసలెందుకు ఈ మంటలు వస్తున్నాయి, అగ్నికి ఆజ్యం పోస్తున్నదెవరూ అన్నదే మిస్టరీగా మారింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులే కాదు, గ్రామస్తులు సైతం పరేషాన్ అవుతున్నారు.
అకస్మాత్తుగా చెలరేగుతోన్న మంటల్లో పత్తిపాక గ్రామానికి చెందిన నాంపల్లి వెంకటమ్మ ఇంట్లో ఉన్నట్టుండి మంటలు వస్తుండడంతో భయంతో వణికిపోతున్నారు. ఒకే ఇంట్లో గత 15 రోజులుగా అగ్ని ప్రళయం సృష్టిస్తుండడంతో అసలేం జరుగుతోంది అన్నదే అంతు చిక్కకుండా మారింది. దీంతో నాంపల్లి కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లకుండా ఆరుబయటే జీవనం సాగిస్తున్నారు. మంటలు ఎలా వస్తున్నాయో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు ఏ క్షణంలో ఎక్కడ మంటలు చెలరేగుతాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మొదటిరోజు ఇంటి ఆవరణలో ఉన్న గడ్డివాము, రెండోరోజు టీవీ, మూడోరోజు బెడ్స్, బట్టలు ఇలా రోజుకో చోట నిప్పు పుట్టి అవి పూర్తిగా కాలి బూడిద కావడం రివాజుగా మారింది. అంతేగాకుండా.. ఇంట్లో నాలుగు గదులుంటే రెండు గదుల్లో మాత్రమే నిత్యం అగ్ని చెలరేగుతోంది.
నిన్నటికి నిన్న ఇంట్లోని సెల్ఫ్ (సజ్జ)లపై మంటలు చెలరేగి బట్టలు, కీలక పత్రాలు కాలిపోయాయి. క్షణ క్షణం నరకం చూపుతోన్న అగ్ని ప్రతాపానికి భయపడిపోయిన నాంపల్లి కుటుంబ సభ్యులు ఇంట్లోని సామాన్లు బయట పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అసలేం జరిగి ఉంటుందోనని కొందరు ఆలోచిస్తుంటే, మరికొంతమంది భయపడిపోతున్నారు. అంతు చిక్కకుండా చెలరేగుతున్న మంటల మిస్టరీని ఛేదించడం ఎలా, ఆ కుటుంబంలో నెలకొన్న ఆందోళనలను తగ్గించడం ఎలా అన్నదే సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది.