- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జనగామలో పెను ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు

X
దిశ, జనగామ: షార్ట్ సర్క్యూట్‌తో బస్సు దగ్ధమైన సంఘటన సోమవారం ఉదయం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు ఇంజిన్ లో సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద లగ్జరీ బస్ దగ్ధం అయ్యింది. ఈప్రమాద సమయంలో బస్సు లో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా కిందికి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వీరందరూ చత్తీస్ ఘడ్ నుంచి హైద్రాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి బస్సులోని మంటలను ఆర్పారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story