- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బైక్ పై తీసుకెళ్తుండగా పేలిన పటాకులు.. తండ్రీకొడుకులు సజీవదహనం

X
దిశ, వెబ్ డెస్క్: బైక్ పై పటాకులను తీసుకెళ్తుండగా అవి పేలి తండ్రీకొడుకులు సజీవదహనమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన కలైనేషన్ (35), అతని కుమారుడు ప్రదేశ్ (7)లు దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం పటాకులతో బైక్ పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మంటలు చెలరేగాయి. అనంతరం భారీ పేలుడు సంభవించి బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులిద్దరూ సజీవదహనమయ్యారు. బైక్ పై తీసుకెళ్తున్న రెండు పటాకుల కట్టలపై బాలుడు కూర్చోవడంతో ఘర్షణ, ఒత్తడి ఏర్పడిందని, ఈ కారణంగానే భారీ పేలుడుకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో మరో నలుగురికి కూడా తీవ్ర గాయలైనట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Next Story