కాకి వల్లే అగ్నిప్రమాదం : అధికారులు

by  |
కాకి వల్లే అగ్నిప్రమాదం : అధికారులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ట్రాన్స్ కో కార్యాలయంలో హై టెన్షన్ వైర్లు షాట్ సర్క్యూట్ కు గురికావడంతోనే అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు ధృవీకరించారు. అయితే కాకి వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ట్రాన్స్ కో కాంప్లెక్స్ ఆవరణలోని 33 /11 కేవీ సబ్ స్టేషన్ నుంచి చొప్పదండికి విద్యుత్ సరఫరా చేసే హై టెన్షన్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ లైన్ కు సంబంధించిన రెండు వైర్లపై కాకి వాలడంతో షాట్ సర్క్యూట్ జరిగింది. దీంతో కాకి దగ్ధమై కిందపడిపోయింది. దీంతో అక్కడే ఉన్న కేబుల్స్ కు నిప్పంటుకోవడం, వాటి పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మార్లు కూడా కాలిపోయాయి. ఈ ఘటనలో 20 ట్రాన్స్ ఫార్మార్లు దగ్ధమయ్యాయి.

అయితే ట్రాన్స్ ఫార్మార్లు సరఫరా చేసిన కంపెనీ వారంటీ ఉంటే నష్టం తగ్గే అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. లేనట్టయితే రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో వాడేసిన కేబుల్ బిండల్స్ ఉంచడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాగే కొత్త ట్రాన్స్ ఫార్మార్లను సురక్షిత ప్రాంతంలో ఉంచకుండా ఆరుబయట ఉంచడాన్ని గమనిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని ప్రజలు ఫైరవుతున్నారు.


Next Story