- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై మర్డర్ కేసు
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలంపిక్ పతకాలు గెల్చిన సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు నమోదైంది. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మంగళవారం రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్ కుమార్, అతడి స్నేహితులు చేసిన దాడి కారణంగానే వ్యక్తి మరణించినట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగానే రెజ్లర్లు గొడవ పడ్డారని.. వీరికి ఎంతో కాలంగా వైరం ఉన్నదని తెలుస్తున్నది. గతంలో కూడా వీళ్లు పలుమార్లు ఘర్షణలకు దిగినట్లు తెలుస్తున్నది. కాగా, మంగళవారం ఘటనలో బాహాబాహీ తలపడటమే కాకుండా ఒక రెజ్లర్ గన్ తీసి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో వారిపై పోలీసులు హత్యానేరంపై కేసులు నమోదు చేశారు. కాగా దీనిపై రెజ్లర్ సుశీల్ కుమార్ స్పందిస్తూ.. ‘ఘర్షణ పడిన వ్యక్తులు మా రెజ్లర్లు కాదు. గత అర్దరాత్రి కొంత మంది స్టేడియం గోడ దూకి లోపలకు వచ్చారు. వచ్చిన తర్వాత గొడవపడుతుండటంతో పోలీసులకు సమాచారం అందించాము. స్టేడియంలో జరిగిన గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పాడు.