- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచిన్‌పై చీటింగ్ కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: హీరో కమ్ బిజినెస్‌మ్యాన్ సచిన్ జోషి మరోసారి లీగల్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నాడు. ఫండ్స్ చెల్లించడం లేదంటూ సచిన్ బిజినెస్ పార్టనర్ తనపై కేసు నమోదు చేశాడు. ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ. 58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించలేదని ఆరోపిస్తూ ముంబైకి చెందిన పరాగ్ సంఘ్వి పుణెలోని చతుశృంగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జోషి అండ్ పార్టనర్స్‌తో సంఘ్వి కాంట్రాక్ట్ కుదుర్చుకోగా.. ఒప్పందం ప్రకారం ప్లే బాయ్ బీర్ గార్డెన్ ఫ్రాంచైజ్‌కు చెందిన కోరెగావ్ పార్క్‌కు సచిన్ జోషి రాయాల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ 2016 నుంచి సచిన్ పేమెంట్ చేయడం లేదని ఆరోపించిన సంఘ్వి.. ఈ విషయంపై అప్పుడే పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కంప్లయింట్ ఆధారంగా పుణె పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఎకనామిక్ నేరాల విభాగం (EOW) ప్రాథమిక దర్యాప్తు చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని జోషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కాగా ప్రస్తుతం అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హెచ్.ఎమ్ ననవరే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, గుట్కా కింగ్ సచిన్ జోషి లీగల్ ట్రబుల్స్ ఎదుర్కొనడం ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. సచిన్‌కు చెందిన వీకింగ్ కంపెనీ జీతాలు చెల్లించడం లేదంటూ గతంలోనూ ఆరోపణలు వెలువడ్డాయి. అంతేకాదు, టాలీవుడ్ డ్రగ్స్ కేసు కుంభకోణంలోనూ అక్టోబర్ 2020లో సచిన్ జోషిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.