ఢిల్లీలో మాస్క్ ధరించకపోతే భారీ ఫైన్

by Shamantha N |
ఢిల్లీలో మాస్క్ ధరించకపోతే భారీ ఫైన్
X

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ సర్కారు వడివడిగా చర్యలు తీసుకుంటున్నది. మాస్కు ధరించడంపై ప్రజలు అలసత్వం వహించవద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాను రూ. 500 నుంచి రూ. 2,000 పెంచినట్టు తెలిపారు. వీలైన ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రజలకు మాస్కులను పంపిణీ చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్ర సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. అదనంగా ఐసీయూ బెడ్‌లను ఏర్పాటు చేయడంపై హర్షంవ్యక్తం చేశారు.

18 రోజులు ఏం చేశారు?: హైకోర్టు

కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంపై ఢిల్లీ సర్కారు ఎందుకు జాప్యం చేసిందని హైకోర్టు మండిపడింది. వివాహ వేడులకు హాజరయ్యేవారి సంఖ్యను తగ్గించడానికి 18 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని, ఇంతలో ఎంత మంది కరోనాతో చనిపోయారో కదా? అని ఆగ్రహించింది. ఈ నెల 1 నుంచే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, సర్కారు నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయిందని, 11వ తేదీన కోర్టు ప్రశ్నలతో సర్కారు మొద్దు నిద్ర నుంచి మేలుకొందని మండిపడింది. కట్టడి చర్యలు తీసుకోవడానికి 18 రోజులు ఎందుకు తీసుకున్నదని, సర్కారును కోర్టులు మేలుకొల్పాలా? అంటూ ప్రశ్నించింది. మాస్కులు ధరించనందుకు జరిమానాల అంశాన్నీ ప్రస్తావించింది. ఇప్పుడీ ఉల్లంఘణలు సర్వసాధరణమైపోయాయని తెలిపింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed