- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోత్కూరులో మేకలు, పందులకు ఫైన్

X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్లపై తిరుగుతున్న మేకలు, పందుల యజమానులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మేకకు రూ. 1000, పందికి రూ. 5000 చొప్పున జరిమానా విధించారు. మున్సిపాలిటీ కేంద్రంలో కొంతమంది మేకలను, పందులను ఇళ్లలో పెంచుతున్నారు. కానీ, వాటిని మేత కోసం అడవికి తీసుకెళ్లకుండా వీధులలో వదిలేస్తున్నారు. అవి మేతకోసం కూరగాయలు, పండ్ల, దుకాణాల మీద పడి మేస్తూ వ్యాపారులను ఇబ్బంది పెడుతూ రోడ్డుకు అడ్డంగా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ మల మూత్ర విసర్జన చేస్తున్నాయని, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, వాటిని ఆపీస్ కు తరలించి యజమానులకు జరిమానా విధించినట్లు మున్సిపాలిటీ మేనేజర్ శంకర్ తెలిపారు.
Next Story