ఒలంపిక్స్‌లో ప్రేక్షకుల అనుమతిపై ఫిబ్రవరిలో నిర్ణయం

by Shyam |
ఒలంపిక్స్‌లో ప్రేక్షకుల అనుమతిపై ఫిబ్రవరిలో నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్ప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని రకాల క్రీడలు తిరిగి మొదలయ్యాయి. క్రికెట్‌ కూడా తిరగి ప్రారంభమైంది. అంతే కాకుండా కొన్ని నిబంధనల మధ్య ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021లో జరగాల్సిన ఒలంపిక్స్‌లో ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే దీనిపై ఒలంపిక్ నిర్వాహక కమిటీ చీఫ్ యోషిరో మోరీ స్పష్టతనిచ్చారు.

ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.. అయితే ప్రేక్షకులను అనుమతించే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. ప్రేక్షకుల అనుమతిపై ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రస్తుతం టోక్యో పరిసర ప్రాంతాల్లో అత్యైక పరిస్థితిని విధించారని.. ఫిబ్రవరి 8 తర్వాత దాన్ని సడలించే అవకాశం ఉన్నది కాబట్టి ఆ తర్వాతే ప్రేక్షకుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Advertisement

Next Story