- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యేపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
దిశ, నారాయణఖేడ్: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అతని అనుచరులపై దాఖలైన పిటిషన్‌లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అది తప్పుడు పిటిషన్ అని, దాఖలు చేసిన ఇద్దరికి హైకోర్టు రూ .10 వేల జరిమానా విధించినట్లు నారాయణఖేడ్ ఎస్సై సందీప్ తెలిపారు. పట్టణంలోని రామమందిరానికి సంబంధించిన భూముల కౌలు విషయంలో వివాదం రేగింది. తాము తమ తాతల కాలం నుంచి భూములు కౌలు చేస్తున్నామని, అయితే పట్టణానికి చెందిన మూఢ రామకృష్ణతో పలువురు భూమిని సాగు చేయనీయడం లేదని జనార్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డిలు ఆరోపించారు.
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కౌలు డబ్బులు తీసుకుని తమకు అన్యాయం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా ప్రభుత్వపరంగా భూములు ఎవరికీ కౌలుకు ఇవ్వలేదని ఆలయ ఎండోమెంట్ ఈఓ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని జనార్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై రాజకీయంగా అభాసుపాలు చేయాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు పిటినషన్ వేశారని భావిస్తూ పిటిషన్‌దారులకు రూ .10 వేలు జరిమానా కోర్టు విధించినట్లు ఎస్‌ఐ వివరించారు.