క్రికెటర్లకు సకాలంలో వేతనాలు అందట్లేదు: ఫికా

by Shyam |
క్రికెటర్లకు సకాలంలో వేతనాలు అందట్లేదు: ఫికా
X

దిశ, స్పోర్ట్స్: మూడో ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లకు వేతనాలు సకాలంలో అందించడం లేదని, ఒప్పందాల నిబంధనలకు ఐసీసీ సహా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తూట్లు పొడుస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్స్ (ఫికా) ఆరోపించింది. క్రికెటర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన నివేదికను సోమవారం విడుదల చేసిన ఫికా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి క్రికెటర్ల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ఐసీసీ ఈవెంట్లకు సంబంధించిన ప్రైజ్ మనీ వాటాను బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇంకా పొందలేదని, జింబాబ్వే క్రికెటర్లతోపాటు ఒక శాశ్వత సభ్య దేశం కూడా అదే సమస్య ఎదుర్కుంటున్నట్లు సదరు నివేదికలో ఫికా పేర్కొంది. టీ10, టీ10 లీగ్స్ ఆడుతున్న చిన్న దేశాలతో పాటు కెనడా, యూఏఈ, ఖతర్ క్రీడాకారులు కూడా చెల్లింపుల సమస్యను ఎదుర్కోవడం తమ దృష్టికి వచ్చినట్లు ఫీకా సీఈవో టాప్ మొఫ్పాత్ స్పష్టం చేశారు. క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకొనే ఐసీసీ ఇకపై ఫికాతో కలిసి పని చేస్తే సమస్యలు పరిష్కరించవచ్చని, అలాగే దేశీయ క్రికెట్‌కు సంబంధించి ఆయా దేశాల క్రికెటర్ల సంఘాలతో చర్చించాలని ఫికా కోరింది.

Advertisement

Next Story

Most Viewed