- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌పై ఫ్రాంచైజీల ఫైర్
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి మరో ఎనిమిది రోజులే సమయం ఉంది. యూఏఈలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చురుగ్గా సాగుతున్నాయి. క్రీడాకారుల ప్రాక్టీస్ కూడా మొదలైంది. రేపో మాపో అందరూ ఐపీఎల్ బబుల్‌లోకి ప్రవేశిస్తారు. కాగా, పలు అంశాలు, సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌పై ఫ్రాంచైజీలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆలస్యంగా యూఏఈ చేరుకుంటున్నారు.
బయోబబుల్ నుంచే వీళ్లు యూఏఈ వస్తుండటంతో వీళ్లకు క్వారంటైన్ ఉంటుందా? లేదా? అనే విషయంపై ఐపీఎల్ జీసీ స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఉంటే ఎంతకాలం వారిని క్వారంటైన్‌లో ఉంచుతారని కూడా తేల్చడం లేదు. ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు గాను ఏడింటిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లు సెప్టెంబర్ 17న యూఏఈ చేరుకునే అవకాశం ఉంది.
దీంతో వారి క్వారంటైన్ విషయంలో గందరగోళం నెలకొంది. జీసీ స్పందనతో విసిగిపోయిన ఫ్రాంచైజీలు గంగూలీకి పిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో వెంటనే ఆయన యూఏఈ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ప్రారంభం అయ్యాక యూఏఈ రావల్సి ఉంది. కానీ ఫ్రాంచైజీల ఫిర్యాదుతో ముందుగానే గంగూలీ అక్కడకు వచ్చారని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.