గ్రేటర్ పరిధిలో ఫీవర్ సర్వే..

by Shyam |
గ్రేటర్ పరిధిలో ఫీవర్ సర్వే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్​పరిధిలోని 1.28 లక్షల ఇండ్లల్లో ఇంటింటి ఫీవర్​సర్వే పూర్తి చేశారు. ఫీవర్ సర్వేలో భాగంగా గురువారం 47,582 ఇళ్లలో సర్వే నిర్వహించారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 700 బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను చేపడుతున్నాయి. ఒక్కో బృందంలో ఒక ఏఎన్ఎం, ఆశావర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వేను చేపట్టారు.

ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు జ్వరం ఉన్న కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. ఇక నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో 18,765 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. కాగా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ద్వారా 130 మందికి కోవిడ్ సంబంధిత సలహాలు, సూచనలు వైద్యులు అందజేశారు.

Advertisement

Next Story