గృహహింసకు వ్యతిరేకంగా తాప్సీ, అదితి ప్రచారం..

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత దేశంలో 86 శాతం మంది మహిళలు గృహహింసతో బాధపడుతుండగా.. 77 శాతం మంది దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగిందనేది వాస్తవం. ఈ వ్యాధి వ్యాప్తి సమయంలో బాధిత మహిళలు బయటకెళ్లి ఫిర్యాదు చేసి, సహాయం పొందడం కష్టం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మరింత రెచ్చిపోతున్నారు మగ మృగాలు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఫెమీనా ఇండియా # ActAgainstAbuse పేరుతో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రతీ ఒక్కరికి గృహహింస నిరోధక చట్టం మీద అవగాహన కల్పించడం, అలాంటి ఘటనలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, బాధిత మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

View this post on Instagram

Domestic violence is real. In India, one-third of women experience domestic violence and the pandemic has seen a drastic rise in cases. 86% of women in India who were subjected to domestic violence never sought help. 77% kept quiet about it. It’s time to speak up and break the silence against domestic violence. It’s time to #ActAgainstAbuse – an initiative by Femina in association with #UNWomen and @timesnetwork. Report domestic violence when you see it or hear it – Call 181 or WhatsApp 7217735372 To read more about Femina's #ActAgainstAbuse initiative, tap the link in bio. . . . @azmishabana18 @radhikaofficial @aslisona @taapsee @aditiraohydari Special thanks to Prasoon Joshi for penning this powerful poem. #ActAgainstAbuse #FeminaIndia

A post shared by Femina (@feminaindia) on

కాగా ప్రముఖ పాటల రచయిత, జాతీయ అవార్డు గ్రహీత ప్రసూన్ జోషి రాసిన కవితను అవగాహనా అస్త్రంగా ఎంచుకున్న ఫెమీనా.. #ActAgainstAbuse కార్యక్రమాన్ని మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో సీనియర్ నటి షబానా అజ్మీ, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, రాధిక ఆప్టే, అదితి రావ్ హైదరిలను ప్రచార కార్యకర్తలుగా ఎంచుకున్నారు.

మహిళలపై హింసకు ప్రపంచవ్యాప్తంగా సమాజం యొక్క నిశ్శబ్ద ఆమోదం ఉందన్నారు షబానా అజ్మీ. చాలా కాలంగా ఇది ప్రైవేట్ మ్యాటర్ అంటూ మన బాధ్యత నుంచి తప్పుకుంటున్నామని.. బాధితురాలు ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేదని చెప్తూ కాలం వెళ్లదీస్తున్నామన్న షబానా.. ఇక అలాంటివి చెప్పకుండా సమస్య పరిష్కారానికి మనవంతు బాధ్యత తీసుకుందాం అని పిలుపునిచ్చారు.

Advertisement