మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కారేపల్లి సర్పంచ్ స్రవంతిని వార్డు మెంబర్లు నిధుల దుర్వినియోగంపై ఆరా తీశారు. నిధులెందుకు దుర్వినియోగం అయ్యాయో సమాధానం ఇవ్వాలని ఆమెను నిలదీశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement