ఫ్రెంచ్ ఓపెన్ గెలుస్తానని అనుకోవడం లేదు : ఫెదరర్

by Shyam |
Roger Federer
X

దిశ, స్పోర్ట్స్: మాజీ వరల్డ్ నెంబర్ వన్, 20 గ్రాండ్‌స్లామ్స్ గెల్చిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రెండేళ్ల తర్వాత రాకెట్ పట్టి జెనీవా ఓపెన్‌లో పాల్గొన్నాడు. కానీ 75వ ర్యాంకర్ పాబ్లో అందుజార్‌పై 4-6, 6-4, 4-6 తేడాతో ఓడిపోయి రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుందని జెనీవా ఓపెన్‌ క్లేకోర్టుపై ఆడిన ఫెదరర్.. అభిమానులను నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. నా ప్రదర్శన ఇలాగే కొనసాగితే ఫ్రెంచ్ ఓపెన్ గెలుస్తానని కూడా అనుకోవడం లేదని అన్నాడు. ‘గత రెండేళ్లుగా చాలా తక్కువగా టెన్నిస్ ఆడాను. నేను ఏ స్థాయిలో ఆడగలనో నాకు తెలుసు. అదే జెనీవా ఓపెన్‌లో జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలవగలనని ఎలా అనుకుంటాను. నేను వాస్తవ పరిస్థితిని చెబుతున్నాను. నేను గెలుస్తానని ఎవరైనా భావిస్తే అది తప్పే. అయితే కొన్ని విచిత్రమైన సంఘటనలు సంభవించవచ్చు. కానీ గత 50 ఏళ్ల చరిత్రంలో ఫ్రెంచ్ఓపెన్‌లో ఒక 40 ఏళ్ల ఆటగాడు.. రెండేళ్ల నుంచి రాకెట్ పట్టకుండా నేరుగా వెళ్లి టైటిల్ గెలిచిన దాఖలాలు లేవు’ అని నర్మగర్బంగా వ్యాఖ్యానించాడు. రాబోయే కొన్ని వారాలు తన కెరీర్‌లో కీలకమైనవని.. మరింత ఫిట్ నెస్ సాధించి గట్టి పోటీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed