ఏటీపీ కౌన్సిల్‌కు ఎన్నికైన ఫెదరర్, నదాల్

by Shyam |
ఏటీపీ కౌన్సిల్‌కు ఎన్నికైన ఫెదరర్, నదాల్
X

దిశ, స్పోర్ట్స్ : అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్లేయర్స్ కౌన్సిల్‌కు దిగ్గజ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నదాల్ 2వ స్థానంలో, ఫెదరర్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ జూన్ 2022 వరకు కౌన్సిల్‌లో సభ్యులుగా కొనసాగుతారు. వీరితో పాటు అగర్ అలియాసిమ్ (కెనడా), జాన్ మిల్‌మాన్ (ఆస్ట్రేలియ), కెవిన్ అండర్సన్ (సౌత్ ఆఫ్రికా), ఆండీ ముర్రే (ఇంగ్లాండ్), బ్రూనో సోరెస్ (బ్రెజిల్) కూడా ఏటీపీ కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ఇక కొలిన్ డోడ్స్‌వెల్ (బ్రిటన్), డేనియల్ (వెనిజులా) రిటైర్డ్ ఆటగాళ్లు, కోచ్‌ల ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 2021లో జరిగే తొలి సమావేశంలో కౌన్సిల్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. గత ఏడాది వరకు కౌన్సిల్ అధ్యక్ష పదవిలో నోవాక్ జకోవిచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఈ సారి అతడు కౌన్సిల్ ఎన్నికల నుంచి వైదొలగాడు.

Advertisement

Next Story

Most Viewed