- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవా, నార్త్ఈస్ట్ యునైటెడ్ మ్యాచ్ డ్రా
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో మరో ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సోమవారం రాత్రి ఫటోర్డా స్టేడియంలో గోవా ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి గోవా దూకుడుగా ఆడింది. చిన్న చిన్న పాస్‌లతో ప్రత్యర్ధి గోల్ పోస్టు వరకు పలుమార్లు దూసుకొని వెళ్లింది. అయితే 40 నిమిషంలో ఫౌల్ చేయడంతో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌కు పెనాల్టీ లభించింది. దీన్ని ఇద్రిస్సా సైలా ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మార్చాడు. దీంతో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ 1-0 ఆధిక్యంలోనికి దూసుకెళ్లింది.
అయితే మరో మూడు నిమిషాలకే గోవా జట్టు గోల్ సాధించింది. ఇగోర్ అంగులో 43వ నిమిషంలో గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. ఇక రెండో అర్థ భాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. పలుమార్లు ప్రత్యర్థుల గోల్ పోస్టుపై దాడి చేసినా గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. రెండో అర్థభాగంలో ఇరు జట్లు ఒక్కగోల్ కూడా చేయలేక పోయాయి. దీంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో నాలుగింట మూడొంతుల సమయం బంతి గోవా నియంత్రణలోనే ఉన్నది. 600 పాస్‌లు చేసి 17 షార్లు గోల్‌పోస్టు వైపు కొట్టారు. కానీ ఒక్క గోల్ మాత్రమే చేయగలిగారు. ఇక నార్త్ఈస్ట్ యునైటెడ్ ఒక వంతు సమయం మాత్రమే బంతిని తమ నియంత్రణలో ఉంచుకోగలిగింది. 200లోపే పాస్‌లు ఇచ్చుకుంది. పెనాల్టీ కారణంగా నార్త్‌ఈస్ట్ గోల్ సాధించింది. లేకుంటే మ్యాచ్ ఓడిపోయేదే. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు బ్రాండన్ ఫెర్నాండెస్‌కుదక్కగా… లాలెమావియా హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.