సన్న బియ్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ సిద్ధం

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంది, పత్తి పంటలను పండించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నదన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ సంస్థ ద్వారా డిమాండ్ పంటల సూచనలు తీసుకుని రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 52,79,688 ఎకరాల్లో 1.32కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని రైతులక సూచించారు. రాష్టంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు అందుబాటులో ఉన్నాయని, మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలను నిర్మిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం విధానాలు ఆందోళన కు గురి చేస్తుంది. ఆకస్మికంగా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే ఆందోళన ఎదురవుతుందన్నారు. అందుకే ముందుగానే కొనుగోలు కేంద్రాలపై రైతులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎఫ్ సీఐ సన్న బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతుందని, రైతులు ఆ దిశగా సాగు చేపట్టాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story