- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విషాదం : ఒకే రోజు తండ్రీ కొడుకు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డెంగ్యూతో తండ్రీ కొడుకులు మృతి చెందిన ఘటన జిల్లాలోని బలిజపాలెంలో బుధ వారం ఉదయం జరిగింది. గత రెండు రోజుల నుంచి తండ్రీకొడుకులు డెంగ్యూతో బాధపడుతున్నారు. వారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తండ్రీ కొడుకులను ఆసుపత్రికి తరలిస్తుండగా తండ్రి రవికుమార్ (50) మృతి చెందాడు. కొద్ది సేపటికి కొడుకు రవితేజ (24) కూడా మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒకే రోజు తండ్రి కొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story