ఈదుతూ ఒడ్డునపడ్డ కొడుకు… తండ్రి గ‌ల్లంతు

by Sridhar Babu |
ఈదుతూ ఒడ్డునపడ్డ కొడుకు… తండ్రి గ‌ల్లంతు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: వరద ఉధృతి ఎక్కువై తండ్రీకొడుకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి బండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మండల కేంద్రంలోని రాధోని చెరువు అవతలి వైపు వారి పొలం ఉండడంతో ఉదయాన్నే తండ్రీకొడుకులు మోటర్ సైకిల్‌పై వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అలుగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో మోటార్ సైకిల్‌తో సహా దిగువకు కొట్టుకుపోయారు.

కుమారుడు నీటిలో ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. తండ్రి గల్లంతైనట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడకు చేరుకొని గాలిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చెరువు అలుగు ఉధృతి అధికంగా ఉండడంతో కింది ప్రాంతంలో ఆచూకీ వెతకడం కష్టతరంగా మారినట్టు స్థానికులు తెలిపారు. తండ్రీకొడుకుల వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed