- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తండ్రి బాధ చూడలేక.. కుమారుడి ఆత్మహత్య

దిశ, నల్లగొండ క్రైం: కుటుంబ ఆర్థిక పరిస్థితి, తండ్రి పడుతున్న బాధను చూడలేక కుమారుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన చెందిన యర్రమాద సదానంద్ చేనేత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కరోనా ప్రభావంతో పనులు లేక కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది. బతుకుదెరువుకోసం ఆరునెలల క్రితం పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలతో హైదరాబాద్ కు వెళ్లాడు. అక్కడ కూడా సరైన పనులులేకపోవడంతో తండ్రికి తోడుగా ఉండేందుకు కుమారుడు శివ ఫ్లంబర్ పనిలో చేరాడు. సరైన కూలీ రాకపోవడం, కుటుంబ పరిస్థిని గమనించి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్క కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం దుఖ:సాగరంలో మునిగిపోయింది. చేతికి ఎదిగిన కుమారుడు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దాతల సహాయం కోసం ఎదురు చూస్తోంది. దాతలు 9948364715 నెంబరుగా గూగుల్ పే, ఫోన్ పే చేసి చేనేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని యరమాద శివ స్నేహితులు కోరుతున్నారు.