- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫరూఖ్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ
దిశ, వెబ్ డెస్క్: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నించింది. జమ్ము కశ్మీర్ క్రికెట్ అసొసియేషన్‌లో ఆర్థిక అవకతలవకలకు సంబంధించిన కేసులో అబ్దుల్లాను విచారించింది. అబ్దుల్లా, మరో ఎన్‌సీ ఎంపీతోపాటు ఇంకో ముగ్గురిపై క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసును సీబీఐ 2018లో దాఖలు చేసింది. 2002-11 కాలంలో రూ. 43.69 కోట్ల అవకతవకలు జరిగాయని సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
ఈ కేసులో గతేడాది జులైలో ప్రశ్నించిన ఈడీ తాజాగా సోమవారం మరోసారి ప్రశ్నించింది. గతేడాది ఆర్టికల్ 370 నిర్వీర్యానికి ముందు సమన్లు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ తాజాగా, కశ్మీర్ పార్టీలన్నీ గుప్కార్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టి పీపుల్స్ అలయెన్స్‌ను ప్రకటించిన నేపథ్యంలో సమన్లు జారీ చేసింది. బీజేపీ వైఖరిని ప్రశ్నించినవారిపై కేంద్రం కుట్రలు పన్నుతున్నదని, అబ్దుల్లా విచారణ కూడా రాజకీయ కుట్రేనని ఎన్‌సీ విమర్శించింది. పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా కేంద్ర సర్కారు కుట్రేనని ఆరోపించారు.