నగదు కోసం ఎగబడిన రైతులు

by Sridhar Babu |
నగదు కోసం ఎగబడిన రైతులు
X

దిశ,జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును జమచేయడంతో పెట్టుబడి సాయం తీసుకునేందుకు పెద్ద ఎత్తున రైతులు బ్యాంకుల వద్దకు తరలివచ్చి బ్యాంకుల ఆవరణలో బారులు తీరారు. కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేయడంను తెలుసుకున్న రైతులు ఖరీఫ్ ఏర్పాట్ల కోసం నగదు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉదయమే పలు బ్యాంకుల వద్దకు చేరుకుని క్యూకట్టారు.

దీంతో జిల్లా కేంద్రంలోని పలు బ్యాంకుల వద్ద ఉదయం నుండే సందడి నెలకొంది. అయితే రైతులు, సాధారణ ఖాతాదారులు అధిక సంఖ్యలో రావడంతో బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా అయ్యింది. దీంతో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్క్ పెట్టుకోకుండా కొవిడ్ నిబంధనలు విస్మరించారు. అలానే రైతులు ఒకరిపై ఒకరు పడేటట్లు క్యూలో నిలబడడం విమర్శలకు తెర లేచింది. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులు కొవిడ్ నిబంధనల ఏర్పాట్లను విస్మరించడంతో బ్యాంకు అధికారుల తీరుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.లాక్ డౌన్ కారణంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు భావిస్తున్నా ప్రజలు, బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరడంతో ఆందోళన కలిగిస్తుందిదటున్నారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు పట్టణ పోలీసుల సహకారం తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story