- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి సొంతూళ్లో.. ధాన్యం దహనం చేసిన రైతులు
దిశ, వరంగల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో మార్కెట్‌లో రైతులు ఒకేచోట గుమిగూడకుండా టోకెన్ల పద్దతి ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని మార్కెట్‌లో గత నెలరోజుల కిందట 500 మందికి టోకెన్లు ఇచ్చి ఇప్పటివరకూ 120 మంది ధాన్యాన్నే కొనుగోలు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుని చూసి రైతుల కడుపుమండి మార్కెట్ యార్డులో రైతులు ధాన్యాన్ని దహనం చేశారు. తమ ఇబ్బందుల గురించి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. బస్తాకు నలభై రెండు కిలోల తూకం వేసి తామే వాహనంలో మిల్లు వద్దకు తీసుకెళ్తే అక్కడ మిల్లర్లు 44 కిలోలు ఉంటేనే దిగుమతి చేసుకుంటామని నిరాకరిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పినా ఫలితం లేకుపోవడంతో రైతులు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు.