- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేట జిల్లాలో రైతుల ఆందోళన
దిశ, మెదక్: అనుమతులు లేకుండా అధిక ధరలకు కంది విత్తనాలు విక్రయించి మోసం చేశాడంటూ సిద్దిపేట జిల్లా ధర్మారం రైతులు ఆందోళనకు దిగారు. విత్తనాలు అమ్మిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుంచి కంది విత్తనాలను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఒక్కొ విత్తనాల ప్యాకెట్ ధర రూ.430 ఉంటే, రూ.2,430ల ధర ముద్రించి వాటిని రూ.1800లకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం రైతులకు తెలియడంతో గ్రామ పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. వ్యవసాయాధికారి మల్లేశంకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై శ్రీనివాస్ రైతులకు విక్రయించిన కంది సంచులను స్వాధీన పర్చుకొని యాదగిరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో రెండు కంది ప్యాకెట్లు దొరకడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.