- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగు విధానం మారితేనే.. సమయం, పెట్టుబడి ఆదా..
దిశ, తెలంగాణ బ్యూరో : వరి సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. వెద జల్లడం, విత్తుకోవడం మూలంగా పెట్టుబడితో పాటు సమయం ఆదా అవుతుందని, దిగుబడులు పెరుగుతాయన్నారు. వరి నేరుగా విత్తుకునే పద్ధతులపై టీ శాట్ ఛానల్‌లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు పంటల సాగు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడు పత్తి సాగు ప్రధాన పంటగా మారిందని తరువాత వరి పండిస్తున్నారని తెలిపారు.
వరి సాగులో సాంప్రదాయ పద్ధతుల మూలంగా ఎకరాకు రూ.8 నుండి రూ.10 వేలు ఖర్చు అవుతుందని, పెట్టుబడి ఖర్చు తగ్గించుకునే పద్ధతులను రైతాంగం అవలంభించాలని చెప్పారు. రాబోయే తరాలు వరి నాట్లు వేసే అవకాశాలు లేవని, అందుకే వ్యవసాయం చేసే విధానాలు మారాలన్నారు. ఆధునిక పద్ధతులలో వరి సాగు మూలంగా కూలీల సమస్యను, అధిక పెట్టుబడితో పాటు విలువైన సమయం కూడా ఆదా అవుతుందన్నారు.
ఈ సాగు మూలంగా ఎకరాకు 1 నుండి 2 క్వింటాళ్ల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. వానా కాలంలో పది రోజులు, యాసంగిలో 10 రోజుల ఆదా మూలంగా యాసంగి పంటను వడగండ్ల వాన, ఇతర గాలి వానల మూలంగా కాపాడు కోగలుగుతామన్నారు. ముందస్తుగా సీజన్ చేసుకోవడం మూలంగా ప్రకృతి విపత్తును రైతాంగం ఎదుర్కొనగలుగుతుందని, ప్రకృతిని ఎలాగూ ఆపలేం కావున ఆధునిక పద్దతులను అవలంభిచడమే మంచిదని తెలిపారు.