సాదాబైనామాతో కొత్త క‌ష్టాలు..!

by Sridhar Babu |
సాదాబైనామాతో కొత్త క‌ష్టాలు..!
X

ఖ‌మ్మం గ్రామీణ మండ‌లంలో రామ‌కృష్ణ అనే వ్యక్తి (పేరు మార్చాం) 25 ఏళ్ల క్రితం ఎక‌రం భూమిని కుంటుబ అవ‌స‌రం నిమిత్తం అమ్ముకున్నాడు. కాగా కామా నాగేశ్వర‌రావు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. (పేరు మార్చాం) 2018లో ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన సాదాబైనామాలో పాసు పుస్తకానికి ద‌ర‌ఖాస్తు చేసుకోగా ప్రభుత్వం పుస్తకం అంద‌జేసింది. 2020 ప్రభుత్వం మ‌ళ్లీ సాదాబైనామాకు అవ‌కాశం క‌ల్పించ‌డంతో అమ్మిన వ్యక్తి కుమారుడు త‌న తండ్రి త‌న‌కే భూమి అమ్మిన‌ట్టుగా తెల్ల కాగితం సృష్టించి సాదాబైనామాలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ఇలా కావాల‌ని స‌మ‌స్యలు సృష్టించి కొనుగోలు దారుల నుంచి డ‌బ్బుల లాగేందుకు ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇలా ఇదొక్కటేకాదు. చెపుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల స‌మ‌స్యలు ఉన్నాయి.

ఇలాంటి చిక్కు స‌మ‌స్యల‌కు ఇంత‌కు ముందు రెవెన్యూ కోర్టులు ఉండేవి. అక్కడ స‌మ‌స్య‌లు తెలిసిన అధికారులు ఉండేవారు కాబట్టి సులువుగా ప‌రిష్కారం ల‌భించేది. ఇప్పుడు ప్రతి స‌మ‌స్య సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలంటే ఎన్ని ఏళ్లు ప‌ట్టాలి. కొనుగోలుదారు ఎలా ఈ స‌మ‌స్యల నుంచి బ‌య‌ట‌ప‌డాలి. ఇలాంటి చిక్కు స‌మ‌స్యల‌ను ప్రభుత్వం ఎలా ప‌రిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే..

దిశ‌, ఖ‌మ్మం : ప్రభుత్వం కొత్తగా తీసుకువ‌చ్చిన సాదాబైనామాతో ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసిన రైతులు, అనుభ‌వ‌దారులు ఇబ్బందులు గురికానున్నాయి. 60 సంవ‌త్సరాల క్రితం తాత‌‌ భూమిని అమ్మితే ఇప్పుడు మ‌నుమ‌డు వ‌చ్చి మా తాత భూమిని అమ్మలేదు కౌలుకు ఇచ్చాడు. మా భూమి మాకే కావాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిర‌గ‌డం సాదాబైనామాలో కొత్తగా పాసుపుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన త‌రువాత ప్రభుత్వం 2018 ఏప్రిల్‌లో కొత్త పాసుపుస్తకాలు ఇ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలాంటి స‌మ‌స్యల‌తోనే చాలా గ్రామాల్లో ప‌ట్టాదారుల వారుసులు వ‌చ్చి పాసుపుస్తకాలు రాకుండా అడ్డుకున్నారు. అప్పటి వ‌ర‌కు పాసు పుస్తకాలు ఉండి కూడా కొత్త పుస్తకాలు రాక‌పోవ‌డంతో వారి భూములు పార్ట్ బీ చేరిపోయాయి. వారికి ఇప్పటి వ‌ర‌కు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పడు ప్రభుత్వం మళ్లీ సాదాబైనామా తీసుకుంచ్చింది. మ‌రి ఇప్పుడైనా పార్ట్ బీ భూముల‌కు పాసుపుస్తకాలు ఇస్తారా లేదా అని భూములు కొనుగోలు చేసిన వారు ఆందోళ‌న‌లో ఉన్నారు. ప్రభుత్వం చిన్న పుస్తకం ఇవ్వక ముందు ఎలాంటి లిటికేష‌న్ లేని భూములు ఇప్పుడు పార్ట్ బీలో చేరాయి. దీంతో వేల‌కు వేలు పోసి కొనుగోలు చేసిన రైతులు లోన్లు, రైతుబంధు రాక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

తెల్లకాగితాలు సృష్టిస్తున్న ప‌ట్టాదారుల‌ వార‌సులు..

ఎప్పడో 50 సంవత్సరాల క్రితం పూర్వికులు భూమిని అమ్మితే ఇప్పుడు వార‌సులు అమ్మలేద‌ని అడ్డుకుంటున్నారు. ఖ‌మ్మం గ్రామీణ మండ‌లంలో వార‌సులు కొన్ని గ్రామాల్లో తెల్ల కాగితాలు సృష్టించి సాదాబైనామాకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. మా భూమి మాకే కావాలంటూ అడ్డోస్తున్నారు. 2018లో ఇలాంటి స‌మ‌స్యలు వ‌స్తే రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించికుండా ఆ భూములును పార్ట్ బీ చేర్చారు. నిజానికి ఆ భూములకు ఎలాంటి స‌మ‌స్యలేదు. అప్పటి వ‌ర‌కు వారికి పాసు పుస్తకాలు ఉన్నాయి. బ్యాంకు లోన్లు వ‌చ్చాయి. కాని వారు చిన్న అడ్డు చెప్పడంతో అధికారులు అత్యుత్సాహంతో పాసు పుస్తకాలు నిలప‌డంతో ఇప్పుడు కొనుగోలుదారులు చిక్కులు ప‌డుతున్నారు. ఇప్పడు ఆ భూముల‌ను సైతం క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి కొత్త పుస్తకాలు అంద‌జేశాయాల‌ని రైతులు కోరుతున్నారు.

సెటిల్మెంట్‌కు రావాల‌ని బెదిరింపులు…

అమ్మకందారుల వార‌సులు కొనుగోలు దారులను సెటిల్‌మెంట్‌కు రావాల‌ని బెదిరిస్తున్నారు. మాట్లాడుకుని ఎంతో కొంత ముట్టజెపితేనే మేము మీ జోలికి రాము. లేక‌పోతే కోర్టులో దావా వేస్తాం ఆ త‌రువాత మీరు భూముల‌ను అమ్మలేర‌ని భ‌య‌పెడుతున్నారు. భ‌య‌ప‌డిన‌వారు ఎంతో కొంత ముట్టజెప్పి మ‌రోసారి కాగితాలు రాయించుకుంటున్నారు. కొంతమంది మేము కొనుగోలు చేసింది నిజం. మీరేమ‌యినా చేసుకోంది. ఇన్నేళ్లుగా భూమిని సాగుచేసుకుంటున్నాం. మాకేమీ కాద‌ని ధైర్యంగా ఉంటున్నారు.

భూములు ధ‌‌ర‌ల‌కు రెక్కలు, గ్రా‌మాల్లో చిక్కలు..

ఖ‌మ్మం న‌గ‌రం రోజురోజుకు విస్తరిస్తుండ‌టంతో రియ‌ల్ ఎస్టేట్ చుట్టపక్కల గ్రామాల‌కు విస్తరిస్తుంది.. దీంతో భూముల ధ‌ర‌ల‌కు రెక్కలొచ్చాయి. ఈ నేప‌థ్యంలో అమ్మిన‌వారికి ఆశ పుడుతుంది. దీంతో అడ్డదారులు తొక్కి కొనుగోలు దారుల నుంచి డ‌బ్బులు డిమాండ్ చేసేవారు పెరిగిపోతున్నారు. క‌ష్టప‌డి కొనుకున్నవారు దీంతో నానా తిప్పలు ప‌డాల్సి వ‌స్తుంది. తినిత‌న‌క కొనుగోలు చేసిన భూముల‌కు ‌కొత్త స‌మ‌స్యలు వ‌స్తుండ‌‌డంతో వారికి రైతుల‌కు నిద్రలేకుండా పోతుంది. ఏం చేయాలో పాలుపెక పంచాయితీల కోసం పెద్దమ‌నుషుల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు. వారు ప‌బ్బం గ‌డుపుకునేందుకు నెల‌ల త‌ర‌బ‌డి తిప్పుకుంటున్నారు. దీంతో పెద్దమ‌నుషుల చుట్టూ తిరిగినా లాభం లేద‌నుకొని అడ్డొచ్చిన‌వారికి ఎంతోకొంత ముట్టజెప్పుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌స్యలు ప్రతి గ్రామంలో ప‌దుల సంఖ్యలో ఉన్నాయి.

కొనుగోలు దారుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు..

సాదా‌బైనామాలో ఎవ‌రైతే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారో ఆ భూమ‌లను క్షేత్రస్థాయిలో ప‌రిశీలిస్తాం. ఎవ‌రైతే భూమిని కొనుగోలు చేసి అనుభ‌విస్తున్నారో వారికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు జారీ చేస్తాం. ఆ భూమి చుట్టూ న‌లువైపుల ఉన్న రైతుల స్టేట్‌మెంట్ సైతం రికార్డు చేస్తాం. గ్రామంలో గ్రామస‌భ‌లు నిర్వహిస్తాం. అవ‌స‌ర‌మైతే గ్రామ పెద్దల స్టేట్‌మెంట్ తీసుకుంటాం. వీఆర్‌వోలు లేనందు ఇద్దరు ఆర్ఐలు ఒక స‌ర్వేయ‌ర్‌తో క‌లిసి టీంను ఫాం చేసి క్షేత్రస్థాయిలో ప‌రిశీలిస్తాం. క‌‌లెక్టర్ ఆర్‌వీ క‌ర్ణన్ ఆదేశాల మేర‌కు ఇప్పటికే కొన్ని టీములు ఫాం చేశాం. క‌లెక్టర్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. కొద్దిగా ఆల‌‌శ్యం అయినా ఎక్కడ ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్రత‌్తలు తీసుకుంటాం.

-కారుమంచి శ్రీ‌నివాస‌రావు, ఖ‌మ్మం రూర‌ల్ త‌హ‌సీల్దార్

Advertisement

Next Story

Most Viewed