- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమినే నమ్ముకున్న రైతు.. వేధింపులు పెరగడంతో ఉరేసుకుని ఇలా!
దిశ, నాగర్ కర్నూల్ : అప్పుల బాధ భరించలేక ఓ రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం పాపగల్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన వస్పరి నాగయ్య (42) తనకున్న 5 ఎకరాల్లో పత్తి, వరి సాగు చేశాడు. మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. దీంతో సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు అయ్యాయి.
గత మూడేళ్ళుగా ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాకపోవడంతో అప్పులు కాస్త పెరిగాయి. ఈసారి సాగుచేసిన వరి పంటను కూడా కొనము అని ప్రభుత్వం చెప్పడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిందని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పొలానికి వెళ్ళిన తన భర్త మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించినట్టు వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు.