‘మా గేదె ఈనింది… DNA టెస్ట్ చేయండి సార్’

by Anukaran |   ( Updated:2021-03-15 01:05:45.0  )
‘మా గేదె ఈనింది… DNA టెస్ట్ చేయండి సార్’
X

దిశ,వెబ్ డెస్క్ : DNA టెస్ట్ చేయించండి సార్ అంటూ ఓ రైతు జిల్లా ఎస్పీకీ మొర పెట్టుకున్నాడు. DNA టెస్ట్ చేయమని జిల్లా ఎస్పీకీ మొర పెట్టుకోవడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? అయితే తాను DNA చేయమని కోరింది వాళ్ల గేదెకు. గేదెకు DNA టెస్ట్ ఎందుకు అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ ప్రాంతానికి చెందిన ఓ రైతు మా గేదెకు పుట్టిన దూడ కనిపించకుండా పోయింది. దాన్ని ఎవరో దొంగిలించారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే 'క్రైమ్ కంట్రోల్ ఫార్ములా' పరిధిలోకి ఆ ఫిర్యాదు రాదని భావించిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. బర్రెలు, గొర్రెలు తప్పిపోతే వెతకడానికి మాకేం పని పాట లేదనుకున్నావా అని తిట్టారు. దీంతో బాధకు గురైన రైతు తన లేగ దూడను వెతుక్కున్నాడు. కానీ ఆ గేదెకు, దూడకు DNA టెస్ట్ చేసి నాకు నా దూడను అప్పగించండి సార్ అంటూ జిల్లా ఎస్పీకీ లేఖ రాశాడు .

Advertisement

Next Story