పాముకాటుతో రైతు మృతి

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పాముకాటుకు గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన కొమురంభీం జిల్లా తిర్యానీ మండలంలోని సుంగాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన సవాయి నానయ్య(42) ఉదయం పత్తి చేనులో డౌర కోట్టడానికి వెళ్లిన నానయ్యకు, చేనులో పాము కరిచింది.

దీంతో అపస్మారక స్థితిలో పడిన ఆయన్ను స్థానికులు గమనించి, హుటాహుటిన తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నానయ్య మృతిచెందాడని చెందాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement