- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుల బాధ తాళలేక.. రైతు ఆత్మహత్య
దిశ, జగదేవపూర్: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని పోచయ్య(45) తనకున్న 20 గుంటల వ్యవసాయ భూమితో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని రెండేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. అధిక వర్షాల మూలంగా పంట దిగుబడి సరిగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంతేగాక ఇటీవల ఇంటి నిర్మాణానికి సుమారు రూ.8 లక్షల అప్పులు చేశాడు. అటు వ్యవసాయంపై ఇటు ఇంటి నిర్మాణాకి చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు కోసం అని వెళ్లి, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకమ్మ కుంటగట్టుపై పోచయ్య బట్టలు, సెల్‌ఫోన్ కనిపించాయి. అనుమానంతో కుటుంబసభ్యులు చెరువులోకి దిగి వెతకగా పోచయ్య మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.