- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతు ఆత్మహత్య
దిశ, కరీంనగర్: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు విగతజీవిగా మారాడు. భూమి పట్టాదారు పేరును మార్చమని వేడుకున్నా కనికరం లేని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి చివరకు ఎమ్మార్వో ఆఫీస్ ముందే పురుగుల మందు తాగి బలవణ్మరణానికి పాల్పడ్డ ఘటన సంచలనం సృష్టిస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎమ్మార్వో ఆఫీసు ముందు జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి అనే రైతుకు సంబంధించిన ఎకరం 20 గుంటల భూమిని తనపేరిట మార్చాలని పలు మార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అధికారులు మాత్రం భూమి పట్టాదారు పేరు మార్చేందుకు నిరసక్తత వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్ వేణుగోపాల్, వీఆర్వోలు గురు ముర్తి, స్వామితోపాటు ఆరుగురి పేర్లు సూసైడ్ నోట్ లో రాసి బలవణ్మరానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.